Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 1, 2026Short Read
ప్రపంచం చూపు ఉత్తరంద్ర వైపు : రామ్మోహన్ నాయుడు
క్విక్ టుడే న్యూస్, ఏపీ :- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ప్రపంచం దృష్టి మొత్తం ఉత్తరాంధ్ర వైపు మళ్లిందని, ఇది తనకు ఎంతో గర్వకారణంగా ఉందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్ఘాటించారు.
ఈ బృహత్తర ప్రాజెక్టుకు విత్తనం వేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని, ఆయన దార్శనికత వల్లే ఇది సాకారమైందని స్పష్టం చేశారు.
ఈ ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక సింహద్వారంలా మారుతుందని, అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు.
దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్ర ప్రజల కలలకు ప్రధాని నరేంద్ర మోడీ తన సహకారంతో రెక్కలు ఇచ్చారని రామ్మోహన్ నాయుడు కొనియాడారు.





